షాకింగ్‌.. ఆరెస్సెస్ డ్రెస్ మొత్తం విప్పేసి మంట‌లో కాల్చేసిన మాజీ ప్ర‌చార‌క్‌ | RSS Uniform | T10

షాకింగ్‌.. ఆరెస్సెస్ డ్రెస్ మొత్తం విప్పేసి మంట‌లో కాల్చేసిన మాజీ ప్ర‌చార‌క్‌ | RSS Uniform | T10


12 సంవత్సరాలు.. సేవ చేస్తున్నానుకొని మతంలోకి మునిగిపోయాను, దేశాన్ని ప్రేమిస్తున్నా అనుకోని మనుషులని ద్వేషించటం మొదలుపెట్టాను. ఆ రెస్సెస్ అంటే దేశభక్తులు ఉండే చోటు అని న‌మ్మాను.. స్వయం సేవక్ నుంచీ ప్రచారక్ గా ఎదిగాను . రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ప్రదెశాన్నీ వదలకుండా తిరిగాను ప్రతీ బాధ్యతనీ నా భుజాల మీద మోశాను.. మోహన్ జీ భగవత్ నుంచీ రామ్ మాధవ్ వరకూ ప్రతీ మనిషితోనూ చనువుగా మెలిగాను. దేశమంతా ఒక్కటే అయినా నా మతమే ఈ దేశం అనుకున్నాను. కానీ నా నమ్మకం అబ్బద్దం అని నేనొక మతప్రచారక, కౄర భావజాలం లోకి పడిపోయానని అర్థం కావటానికి నా పన్నెండు సంవ‌త్సరాలు పట్టింది. కానీ ఆరెస్సెస్ భావజాలాన్ని నరనరాల్లో నింపుకున్న నేను ఈరోజు ఇక్కడినుంచి బయటకు వెళ్తున్నాను 2014 ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ మండలం లోనూ తోటి కార్యకర్తలకు వేలాది మందిని కలుపుకొని అయోధ్య‌లో రామమందిర నిర్మాణం కోసం యఙ్ఞాలు నిర్వహించాను. కానీ ఎన్నికల తర్వాత స్వయంగా మోహన్ జి భగవత్ మాటలు విని నిర్ఘాంత పోయాను… ఒక్క సారి రామమందిరం పూర్తయ్యిందా ఇక హిందూ ముస్లిములను వేరుగా ఉంచే వీలు ఉండదు ముసల్మాన్లకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టే మరో కారణం ఉందదు” అని ఆయన అన్నప్పుడు ముక్కలైన నా నమ్మకం సాక్షిగా ఈ రోజు నా “తెల్లని” చొక్కాని తగలబెడుతున్నాను. ఆరెస్సెస్లో అంతా సమానం అన్నారు, కానీ ఎస్సీ,ఎస్టీ,బీసీలని ఎప్పుడూఉన్నత పదవుల్లోకి రానివ్వలేదు., వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించినట్టు ఏ నిమ్న కులాన్నీ ఒక్క మెట్టుకూడా ఎక్కనివ్వలేదు. ఎందుకు రానివ్వ‌లేదో ఇన్నాళ్ళకు బోదపడింది. నాకింకా గుర్తుంది.. కేసీ ఖన్నన్ సహ సర్కారికా కాకుండా అడ్డుకొని మరీ అతన్ని సంస్తనుండి వెళ్ళగొట్టిన ఘటన ఇంకా మన్సును మెలిపెడుతూనే ఉంది కడప జిల్లాలో ఆరెస్సెస్లోని బ్రాహ్మణ ఆదిపత్యానికి, చేసిన అవమానాలకి సంఘ్ కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకున్న రామాంజనేయులు దేహం ఇంకా కళ్ళముందు వేలాడుతూనే ఉంది. రక్షణ ఎవరినుంచి ఎవరికో ఇప్పుడు అర్థమవుతోంది.. దేశ‌భ‌క్తి నినాదాన్ని వాళ్లు స్వార్థానికి వాడుకుంటున్నారు.. దేశంలో ఒక‌రికొక‌ర్ని శ‌త్రువులుగా చేస్తున్నారు. శాఖలో అంతా సమానమే అన్నాడు మా ప్రచారక్ కానీ బ్రాహ్మణులే మనకు గురువుల స్తానంలో ఉన్నారని కూడా చెప్పాడు రామాలయం మా ఆత్మగౌరవం అని చెప్పారు. ఎన్ని క‌ష్టాలొచ్చినా నిర్మించాల‌న్నారు. ఎన్నికల తరవాతిరోజు ఇంకో ఐదేళ్ళకి కదా ఆ అవసరం అన్నాడు. మమ్మల్నే కాదు దేవున్నీ కూడా వాడుకున్నాడని అర్థమయ్యింది… నిజానికి దేశాన్ని రక్షిస్తున్నా అనుకొని ఒక మహా సమాధిని నిర్మిస్తున్న అన్న విషయాన్ని మర్చిపోయాను.. నా పక్కనే ఉన్న మనుషులని శత్రువులనుకున్నాను భావోద్వేగాల్ని రెచ్చ‌గొడుతూ నేను చాలా మందిని ఆరెస్సెస్‌లో జాయిన్ చేశాను.. నా దేశాన్ని ప్రేమించ‌డం అంటే నా సాటి ప్ర‌జ‌ల‌న్ని ప్రేమించ‌డం అని తెలుసుకోవడానికి నాకు 12 సంవ‌త్స‌రాలు ప‌ట్టింది. ప్రేమించటం మొదలు పెట్టాక ఈ “దండా” (కర్ర) తో ఎవ్వరినీ దండించే అవసరం లేదనీ తెలిసి వచ్చింది.. 12ఏండ్లు ఆరెస్సెస్ ప‌ని చేసినందుకు నేను సిగ్గుప‌డుతున్నాను… అందుకే ఈ “ఘణ వేశ” అనే వేశాన్ని అగ్గిలో బూడిద చేస్తున్నా.. జై భార‌త్‌.. నేను నా భార‌త‌దేశాన్ని ప్రేమిస్తున్నాను..

3 Replies to “షాకింగ్‌.. ఆరెస్సెస్ డ్రెస్ మొత్తం విప్పేసి మంట‌లో కాల్చేసిన మాజీ ప్ర‌చార‌క్‌ | RSS Uniform | T10”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *